07-10-2025 01:49:37 AM
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఎప్పటిలాగానే ఈ విద్యాసంవ త్సరం కూడా గుర్తింపు (అఫిలియేషన్) లే కుండానే పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు నడుస్తున్నాయి. తెలిసీ తెలియక విద్యార్థులు ఆ ఇంటర్ బోర్డు గుర్తింపు లేని ఆ కాలేజీల్లో చేరుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్ జూనియర్ కా లేజీల్లో చేరే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాటికి గుర్తింపు ఉందా.. లేదా? అనే విషయాన్ని చూడకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నారు.
దీంతో వేలాది మంది విద్యా ర్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడుతు న్నది. ఈ విద్యాసంవత్సరం కూడా గుర్తింపు లేని కాలేజీలు 94 వరకు ఉన్నాయి. వీటి లో 92 ప్రైవేట్ జూనియర్ కాలేజులు కాగా, ఒకటి కో మరొకటి సోషల్ వె ల్ఫేర్ కాలేజీ. అయితే చివరి నిమిషంలో ప్రభుత్వం నుంచి వాటికి యాజమాన్యాలు ప్రత్యేక అనుమతులు తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల నిర్వహణకు ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు రావాలంటే ఆ కళాశాల భవన రిజిస్ట్రేషన్ డీడ్ లేదా లీజు డీడ్, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ, మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ, కార్పస్ ఫండ్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్, శానిటరీ సర్టిఫికెట్‌లతోపాటు బోధనా సిబ్బంది డాక్యుమెంట్లు, ఆటస్థలం డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ అన్నిరకాల అనుమతులు వివిధ శాఖల నుంచి తప్పనిసరిగా ఉండాల్సిందే.
అప్పుడుగానీ ఆయా కాలేజీలకు ఆ విద్యాసంవత్సరం అడ్మిషన్లు చేపట్టడానికి ఇంటర్ బోర్డు అధికారులు గుర్తింపునివ్వరు. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజీలు సరైన గుర్తింపు లేకున్నా 2025 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు చేపట్టడమే కాకుండా తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం కూడా ముగిసిపోయింది.
అయినా సరైనా పత్రాలు చూపకుండా, ఇంటర్ బోర్డు నుంచి అనుమతులు తీసుకోకుండానే కాలేజీలను నిర్వహిస్తున్నాయి. అధికారులు కూడా ఆయా కాలేజీల విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తీరా చివరి దశకు వచ్చేసరిగా విద్యార్థుల భవిష్యత్‌ను సాకుగా చూపి గుర్తింపు లేని ఆ కాలేజీలు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులను తెచ్చుకుంటున్నాయి.
మిక్స్‌డ్ ఆక్యుపెన్సీలోనివి 44 ...
చాలా కాలేజీలు బహుళ అంతస్తుల్లోనే నడుస్తున్నాయి. కింద రకరకాల షాపులు, షాపింగ్ మాల్స్, పైన కాలేజీలు ఉంటున్నాయి. ఈ తరహా కాలేజీలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా ఉంటాయి. ఇంటర్ విద్య కార్పొరేట్ మయం కావడం, విద్యార్థులతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావడంతో ఇది ప్రైవేట్ కాలేజీలకు కలిసివస్తున్నది. ప్రతి ఏడాది గుర్తింపు అంశం విమర్శలకు తావిస్తోంది.
గతేడాది ఆగస్టు నెల చివరి వరకు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ, షిఫ్టింగ్ అనుమతి సమస్యలున్న 300పైగా కాలేజీలకు అనుమతి రాలేదు. అయినా ఆ కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టి తరగతులు నిర్వహించారు. వాటికి చివరి నిమిషంలో అనుమతులిచ్చారు. ఈ విద్యాసంవత్సరం మొత్తం ప్రైవేట్ 1460 కాలేజీలు అఫిలియేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే అందులో 1368 కాలేజీలకు అనుమతులు మంజూరు చేయగా, 92 గుర్తింపు లేనివి ఉన్నాయి. వీటిలోనూ 48 సరైన దరఖాస్తులు సబ్‌మిట్ చేయనివి ఉంటే, మరో 44 బహుళ అంతస్తుల్లో ఉన్నవి ఉన్నాయి. ఇదిలాఉంటే, గుర్తింపులేని ఆయా కాలేజీల్లో ఏమంత పెద్ద సంఖ్యలో విద్యార్థులుండరని ప్రైవేట్ కాలేజీల ఆసోసిసియేషన్ నేత ఒకరు తెలిపడం గమనార్హం.
అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇస్తాం
అఫిలియేషన్‌కు సంబంధించి అన్ని సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఏది కరెక్టుగా లేకున్నా గుర్తింపునివ్వం. రిజిస్ట్రేషన్ డీడ్ లేదా లీజు డీడ్, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ, మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ, కార్పస్ ఫండ్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్, శానిటరీ సర్టిఫికెట్ లాంటివన్నీ ఉండాలి. లేనివాటికి అనుమతులివ్వం. అయినా మేం కాలేజీల అడ్మిషన్ లాగిన్ ఐడీలను క్లోజ్ చేశాము.
ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ వసుంధర