calender_icon.png 7 October, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏం మారలే!

07-10-2025 01:45:22 AM

పేరుకే అధికార కాంగ్రెస్.. పెత్తనమంతా బీఆర్‌ఎస్‌దే 

  1. ఆ పార్టీకే జగిత్యాల పోలీసులు, అధికారులు అనుకూలం 
  2. కాంగ్రెస్ కార్యకర్తల మీదే కేసులు పెడుతున్నారు
  3. మాజీమంత్రి జీవన్‌రెడ్డి మండిపాటు

జగిత్యాల అర్బన్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ జగిత్యాల నియోజకవర్గంలో ఇంకా బీఆర్ ఎస్ పెత్తనమే కొనసాగుతున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో సోమవారం ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశం లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం కరువై, నిర్బంధం తీవ్రతరం కావడం, బీఆర్‌ఎస్ నియంతృత్వ పోకడలతో విసిగిపోయిన ప్రజలు మా ర్పు కోరుకోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత వాతావరణం నెలకొన్నదని చెప్పారు.

కానీ జగిత్యాలలో మాత్రం ఇక్కడి అధికారులు, పోలీసులు ఇంకా బీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇక్కడి పోలీస్ యం త్రాంగం కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్నో తప్పుడు కేసులు నమోదు చేశారని, ఇప్పుడు కూడా అదే పోకడ కొనసాగుతోందన్నారు. గతంలో జగిత్యాల మండలం బాలేపల్లి గ్రామంలో బిల్లు చెల్లింపు, జాయింట్ చెక్ పవర్ అంశంలో సర్పం చ్ భూపతిరెడ్డిపై బీఆర్‌ఎస్ ఉపసర్పంచ్ బొక్కల గంగారెడ్డి దాడి చేశాడని, ఈ దాడిలో భూపతిరెడ్డి కాలు విరిగిందని గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉండటంతో అప్పుడు తమ కార్యకర్తకు న్యాయం జరగలేదన్నారు. ఇప్పుడు అదే విషయంలో పాత కక్షలతో బీఆర్‌ఎస్‌కు చెందిన బొక్కల గంగారెడ్డి.. మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, ఆయన కుమారుడు రేవంత్‌రెడ్డిలపై బండరాళ్లతో దాడి చేశాడని ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకుండా రేవంత్‌రెడ్డిపైనే కేసు నమోదు చేశారని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

గొడవ జరుగుతున్న సమయంలో డయల్ 100కు ఫోన్ చేసిన మల్లేశం అనే వ్యక్తిపై, మధ్యవర్తిగా ఉన్న తిరుపతిరెడ్డిపై  కూడా పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. తమపై దాడికి దిగాడని ప్రాణ రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తమ అనుచరుడు రేవంత్‌రెడ్డిపై పోలీసులు కుట్రపూరితంగా ఎలాంటి విచారణ లేకుండా హత్యాయ త్నం కేసు నమోదు చేయడాన్ని జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమ కార్యకర్తలు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని జీవన్‌రెడ్డి తెలిపారు.