26 April, 2026 | 5:46 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఏ కోర్టుకు వెళ్లాలో చెప్పండి సారూ?

05-03-2026 12:41 AM

ఇల్లంతకుంట, మార్చి 4 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం.మోకా మీద వివాదం ఉందని న్యాయస్థానానికి వెళ్ళి పరిష్కరించుకోండి అని తెలిపిన ఇల్లంతకుంట తహశీల్దార్. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇల్లంతకుంట మండలం జవహర్ పేట గ్రామానికి చెందిన గోకులకొండ మల్లయ్య తన భూమి భూ భారతి పోర్టల్ లో తప్పుగా నమోదు అయిందని, దీనిపై సదరు మల్లయ్య ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే సదరు బాధితుడిని విచారణ నిమిత్తం రోజుల తరబడి తిప్పడంతో పాటు చివరగా మీ సోదరుల మధ్య వివాదం ఉందని, దానిపై మీరు న్యాయస్థానానికి వెళ్ళి పరిష్కరించుకోండి అని తహశీల్దార్ మల్లయ్య కు మెమో జారీచేశాడు. దీనిపై బాధితుడు బాధపడుతూ విజయక్రాంతి పత్రిక ప్రతినిధికి తన గోడును వెళ్లబోసుకున్నాడు.దీనిపై సదరు బాధితుడు మాట్లాడుతూ నన్ను ఏ కోర్టు కు వెళ్ళమంటారో చెప్తే అదే కోర్టు కు వెళ్ళి న్యాయం కోసం పోరాడుతానని తెలిపారు. ఏది ఏమైనా పరిష్కరించిన రెవెన్యూ అధికారులే కోర్టు వెళ్లమనడం గమనార్హం.