calender_icon.png 15 May, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరితూకంలో వేగం పెంచండి

15-05-2025 12:53:55 AM

పెద్ద కొత్తపల్లి మే 14 : ప్రస్తుత పరిస్థితు ల్లో వర్ష సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే పరీక్షించి తూకం వేయాలని పెద్దకొత్తపల్లి మండల తాసిల్దార్ జే.కే.మోహన్ అన్నారు. బుధవారం పెద్ద కొత్తపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చంద్రకల్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి అధికారులకు సూచనలు ఇచ్చారు.

ప్రభు త్వం నుండి గన్ని బ్యాగుల కొరత ఏమాత్రం లేదని రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. తూకం వేసిన వెనువెంటనే ఆయా మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని ఆదేశించారు. బుధవారం రెండు లారీల్లో వరి ధా న్యం బస్తాలు లోడింగ్ చేసినట్లు ఆయన తెలిపారు.