15-05-2025 02:30:48 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగులను(RTC employees) ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత ప్రభుత్వ హాయంలో తలపెట్టిన ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆర్టీసీ ఉద్యోగులతో పాటు వామపక్ష నాయకుల పై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ కేసులను తొలగించాలని వామపక్ష నాయకులు అజయ్ సారధి రెడ్డి, లింగయ్య నాయక్, సమ్మెట రాజమౌళి పెరుగు కుమార్, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు నాగయ్య, శ్రీలత కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక రోజులుగా తాము గత ప్రభుత్వ హాయంలో పెట్టిన కేసులపై తిరుగుతున్నామని, గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజల మద్దతుతో గద్దె దింపామని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ కేసులు తొలగించి విముక్తి కలిగించాలని కోరారు.