calender_icon.png 30 August, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రైళ్ల హాల్టింగ్ లో మార్పు..!

15-05-2025 04:24:01 PM

మానుకోటకు బదులు కేసముద్రం..

17 రైళ్లకు ప్రత్యేక హాల్టింగ్.. 

మహబూబాబాద్ (విజయక్రాంతి): కాజీపేట కొండపల్లి రైల్వే సెక్షన్ల మధ్య మూడో లైను నిర్మాణంలో భాగంగా నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కోసం మహబూబాబాద్  రైల్వే స్టేషన్(Mahabubabad Railway Station) లో హాల్టింగ్ ఉన్న 17 రైళ్ళకు హాల్టింగ్ తొలగించి అందుకు బదులుగా కేసముద్రం రైల్వే స్టేషన్ లో తాత్కాలికంగా ప్రత్యేకంగా హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే పిఆర్ఓ శ్రీధర్(South Central Railway CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 27 వరకు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో హాల్టింగు ఉన్న వివిధ రైళ్లు మహబూబాబాద్ లో ఆగకుండా అందుకు బదులుగా కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఆగుతాయని వివరించారు.

మహబూబాబాద్ కు బదులు కేసముద్రంలో తాత్కాలికంగా హాల్టింగ్ కల్పించిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 12746 మణుగూరు సికింద్రాబాద్, 12749 మచిలీపట్నం బీదర్, 12737 కాకినాడ పోర్ట్ లింగంపల్లి, 12709 గూడూరు సికింద్రాబాద్, 12763 తిరుపతి సికింద్రాబాద్, 12727 విశాఖపట్నం సికింద్రాబాద్, 12861 విశాఖపట్నం మహబూబబ్ నగర్, 12759 తాంబరం హైదరాబాద్, 11020 భువనేశ్వర్ ముంబై సిఎస్టి, 18045 షాలిమార్ హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కు బదులు కేసముద్రం రైల్వే స్టేషన్లో హల్టింగ్ కల్పించినట్లు చెప్పారు. అలాగే 24న 12761 తిరుపతి కరీంనగర్, 26న 17206 కాకినాడ సాయి నగర్ షిరిడి, 27న 05073 బెంగళూరు లాల్ ఖాన్, 03680 కోయంబత్తూర్ ధన్ బాద్, 17208 మచిలీపట్నం సాయి నగర్ షిరిడి, 26, 27న 12787 నర్సాపూర్ నాగర్ సోల్, 25, 27న 12656 చెన్నై అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కు బదులు కేసముద్రం రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. ఆయా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరారు.