calender_icon.png 15 May, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

15-05-2025 01:57:04 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం(Kesamudram mandal) కాట్రపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీల వద్దకు ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న వెళ్లి కోరారు. కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా చేసిందని, దీని ద్వారా పెట్టుబడిదారి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండడానికె ఈ విధంగా చేయడం జరిగిందని, ఇది కార్మికులకు ఎంతో నష్టదాయకమని ఆయన అన్నారు. వాటిని రద్దు చేయాలని అదేవిధంగా అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, సమగ్ర చట్టం  చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాటగాని శ్రీనివాస్, కాలేపాక వంశీ, జల్లే జాన్సన్, యాటగాని రాములు, గడ్డం నరసయ్య, పానుగంటి రాములు,  శ్రీనివాస్, చాగంటి రాములు,కలపాక శ్రీను, మునుగోడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.