calender_icon.png 15 May, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చగొడితే ఎలా ఉంటుందో.. పాక్‌కు తెలిసొచ్చింది: రాజ్‌నాథ్ సింగ్

15-05-2025 02:47:31 PM

మనం దాడి చేసిన తీరును శత్రవు ఎప్పటికీ మరువడు

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) గురువారం పర్యటించారు. శ్రీనగర్ లో సైనిక బలగాలతో రాజ్ నాథ్ సింగ్ ముచ్చటించారు. అమరులైన సైనికులకు ఆయన నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులకు రక్షణ మంత్రి సెల్యూట్ చేశారు. దేశమంతా మిమ్మల్ని చూసి గర్విస్తోందని ఆయన పేర్కొన్నారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) ఆకాంక్షించారు. పహల్గామ్ దాడి ద్వారా ఉగ్రవాదులు దేశ ప్రజలను విడదీయాలని చూశారని చెప్పారు. శత్రు స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశామని తెలిపారు.

పాకిస్థాన్ తరుచూ అణు దాడి బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పిన రాజ్ నాథ్ సింగ్ అణు బెదిరింపులకు లొంగేది లేదని భారత్ స్పష్టం చేసిందన్నారు. పాకిస్థాన్ అణ్వాయుధాల భద్రతపై అనుమానాలున్నాయని ఆయన తెలిపారు. పాక్ లాంటి బాధ్యతారహిత దేశం వద్ద అణ్వాయుధాలు ఎంత వరకు సురక్షితం? అని రక్షణ మంత్రి ప్రశ్నించారు. పాక్ అణ్వాయుధాలపై ఐఈఏ వంటి అంతర్జాతీయ సంస్థల నిఘా అవసరమన్నారు. ఉగ్ర దాడులను(Terror attacks) దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ చెప్పారని ఆయన వెల్లడించారు. మనం దాడి చేసిన తీరును శత్రువు ఎప్పటికీ మరువడని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. ఉగ్ర శిబిరాలు ఎక్కడ ఉన్నా.. వాటిని తుడిచిపెడతామని హెచ్చరించారు. ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి.. ఎక్కడికైనా వెళ్తామన్న ఆయన భారత్‌పై ఉగ్రదాడి జరిగితే.. అది యాక్ట్‌ ఆఫ్‌ వార్‌గా పరిగణిస్తామని తెలిపారు. పాకిస్తాన్‌తో(Pakistan) చర్చలు జరిగితే అది ఉగ్రవాద నిర్మూలన, పీఓకే(Pakistan-Occupied Kashmir) అప్పగింతపైనే అన్నారు. రెచ్చగొడితే ఎలా ఉంటుందో.. పాక్‌కు తెలిసి వచ్చిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.