15-05-2025 02:14:40 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) లేఖ రాశారు. ఫీజురీఎంబర్స్ మెంట్ బకాయిలపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైంది అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు(Private colleges) దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడ్డాయని సూచించారు. ఫీజులు చెల్లించినదే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఫీజురీఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని బండి సంజయ్( Bandi Sanjay Kumar) డిమాండ్ చేశారు.