1 July, 2026 | 5:28 PM

ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచండి

12-06-2024 02:35 PM

నాగర్ కర్నూల్ : రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బుధవారం నుంచి పునః ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ మండలం గగ్గాలాపల్లి ప్రాథమిక పాఠశాల, తాడూర్ లోని కస్తూరిబా రెసిడెన్సీయల్ పాఠశాలలను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని టీచర్స్, విద్యార్థుల హాజరు, పాఠశాల భవన్, మరుగుదొడ్ల నాణ్యతన ప్రమాణాలను పరిశీలించి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచలన్నారు. బడి బాట కార్యక్రమానికి 2 వేల కోట్లు నిధులు మంజూరు చేసి విద్య నైపుణ్యం, పిల్లల ఆరోగ్యం, పాఠశాలల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేగ్రౌండ్ అన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిపారు. అనంతరం ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల నుండి 300 రూపాయల కూలి వస్తుందని హామీ ఇచ్చారు.