31 March, 2026 | 1:56 AM

వేతనాలు చెల్లించకుంటే నిరవధిక సమ్మె

31-03-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 30(విజయ క్రాంతి): జిల్లాలో పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలు గు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.

సోమవారం  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కె. హరితకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, మిషన్ భగీరథ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చాపిడి బాలేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంషద్, ప్రధాన కార్యదర్శి షకీర్ పాల్గొన్నారు.