calender_icon.png 15 August, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు

15-08-2025 12:19:19 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవం(Indian Independence Day) సందర్భంగా  కాంగ్రెస్ కార్యాలయం నందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయం లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు జాతీయ జండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ హయాంలో జరిగిన అభివృద్ధి ఈ రోజు దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపింద న్నారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని గా ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జండా ఆవిష్కరణ కార్యక్రమం లో పట్టణ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, ఐ ఎన్ టి యు సి  నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.