calender_icon.png 15 August, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలుగు పాఠశాల విద్యార్థికి విద్యుత్ షాక్

15-08-2025 12:16:55 PM

తృటిలో తప్పిన ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స. 

విద్యార్థిని పరామర్శించిన తహసిల్దార్ ఇమామ్ బాబా.

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally) చిట్యాల మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినికి విద్యుత్ షాక్ తగిలి తృటిలో ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళితే పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని దైనపల్లి సిరి జెండాకు సంబంధించిన కాగితాలను అతికిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది.

వెంటనే గమనించిన ఉపాధ్యాయులు చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయని, మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా చికిత్స పొందుతున్న విద్యార్థిని సిరిని చిట్యాల తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ పరామర్శించి విద్యుత్ షాక్ కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.