15-08-2025 06:47:21 PM
మేడిపల్లి: మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను మేడిపల్లి సిఐ ఆర్ గోవింద రెడ్డి ఎగర వేసి,అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగల ఫలితమే మనం ఈరోజు జరుపుకుంటున్న జెండా పండుగ అని అన్నారు. వాళ్ళ త్యాగాలు వృధా కానీ ఇవ్వకుండా దేశ సరిహద్దుల్లో సైనికులు అదేవిధంగా పోలీసులు వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వాతంత్ర ఫలాలను అందిస్తున్నారని , పోలీసులు ప్రతి ఒక్కరు తమ వృత్తిని నిబద్ధతతో, సేవా భావంతో, ప్రజలకు అందుబాటులో ఫ్రెండ్లీ పోలీసులుగా కర్తవ్య నిర్వహణ ఉండాలని తెలిపారు.