calender_icon.png 15 August, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ

15-08-2025 06:44:38 PM

ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ సంకల్పబద్ధం

సనత్‌నగర్,(విజయక్రాంతి): 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం బన్సీలాల్ పేట్, రాంగోపాల్ పేట్, బేగంపేట్, అమీర్ పేట్, సనత్ నగర్ డివిజన్లలోని పలు ఏరియాల్లో పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..  దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను  అర్పించారని, వారి త్యాగాల ఫలితమే మనమీనాడు స్వేచ్చా వాయువులు  పీలున్తున్నామని, ఆ మహానుబావుల త్యాగాలను మననం చేసుకొని వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకొని అభివృద్ధి పథంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అణగారిన, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుపరుస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రజా పాలనపై రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారు.