15-08-2025 07:00:21 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజేందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అనంతరం వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ అనేక మంది మహనీయుల పోరాట ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని పేర్కొన్నారు.
భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం సాధించిన రోజును జ్ఞాపకం చేసుకునే గొప్ప మహోత్సవం స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ తో పాటు ఎంతో మంది మహనీయులు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. అదే విధంగా కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్వాతంత్ర్య సమరయోధులు, ఇతర ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.