15-08-2025 06:30:50 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సనత్‌నగర్ డివిజన్ బస్టాండ్ ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి పాల్గొని రెపరెపలాడే మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వందలాది స్కూల్ విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేసి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.