స్వతంత్ర సర్పంచ్, వార్డుసభ్యులు కాంగ్రెస్‌లో చేరిక
ఆర్మూర్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభ లో సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ ఉప సర్పంచ్ పస్కా నవ్యత మొత్తం వార్డు సభ్యులు గొల్లపల్లి సురేష్ గౌడ్ మాణిక్యం శ్రీకాంత్ కొమర ఇంద్ర పస్కా ప్రవీణ్ కుమార్ , కల్లెడ సునీత పుండు ప్రమీల గోసం లక్ష్మీ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పడం జరిగింది.
గ్రామంలో నెలకొన్న సమస్యలను వినయ్ కుమార్ రెడ్డి గారికి వివరిస్తూ ప్రభుత్వం నుండి నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరడం జరిగింది. వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ మరియు పాలకవర్గం చెప్పిన విధంగా గ్రామంలోని మురికివాడలు ల,సిసి రోడ్లను ముఖ్యంగా విద్యుత్ స్తంభాలకు సంబంధించిన సమస్యను అలాగే కుల సంఘాలకు సంబంధించిన భవనాలను త్వరలోనే ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమైపోల్ ఉమ్మడి సర్పంచ్ భోజన్న నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దూడ వెంకటేష్ ముత్యం ఫరీద్ పాల్గొన్నారు






