calender_icon.png 30 December, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉర్దూ మీడియం హైస్కూల్‌కు ఇద్దరే ఉపాధ్యాయులు

30-12-2025 12:31:02 AM

జుక్కల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : జుక్కల్ మండలంలోని మండలంలో గల ఒకే ఒక ఉర్దూ మీడియం హై స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు లాంగ్వేజ్ టీచర్లు, సబ్జెక్టు టీచర్లు మరో ముగ్గురు ఉండాల్సిన పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులపై కూడా భారం పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. 2017లో ఈ స్కూల్ హై స్కూల్‌గా అప్గ్రేడ్ అయింది. అప్పటినుంచి ఎస్‌ఎ పోస్టులు భర్తీ కాలేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 57 మంది విద్యార్థులు ఉర్దూ మీడియం చదువుతున్నారు.

ఇద్దరూ ఎస్జిటి ఉపాధ్యాయులు తొమ్మిదవ తరగతి వరకు పాఠాలు బోధించడంతో వారికి న్యాయం చేకూర్చడం లేదంటూ పేర్కొంటున్నారు. ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పదవ తరగతిలో చదివించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర మండలాలకు పంపిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు అప్గ్రేడ్ అయినా హైస్కూల్లో పదవ తరగతిలో విద్యార్థులు చేరకపోవడంపై పేరెంట్స్ పలుమార్లు ఆసనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా..  ఆందోళనలను చేపట్టిన లాభం లేకుండా పోయిందని వాపోతున్నారు. సంబంధిత జిల్లా విద్యా అధికారులు ఇట్టి విషయంపై దృష్టి సారించి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు డ్రాప్ అవుట్ కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.