calender_icon.png 28 January, 2026 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చిలో భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్

28-01-2026 12:16:36 AM

సికింద్రాబాద్, జనవరి 2౭ (విజయక్రాం తి): విద్యుదీకరణ వృద్ది, సుస్థిరత, సాధికరత దిశగా భారత్ ముందుకు సాగుతుందని,ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కనెక్ట్ అవుతుందని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీఫారూఖీ, ఈఈపీసీ ఇండియా డైరెక్టర్ వి.రాజగోపాల్ రావు అన్నారు. విద్యుత్తు రం గంలోని అన్ని విభాగాలకు ఒకే వేధికపైకి తీసు కువచ్చేందుకుగాను ఢిల్లీలో మార్చి 19 నుంచి 22 వరకు భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్2026 పేరుతో భారీ స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్న ట్లు వెల్లడించారు.

ఈ మేరకు మంగళవారం బేగంపేటలోని జరిగిన భారత్ ఎలక్ట్రిక్ సమ్మి ట్ 2026 సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని సమ్మిట్ వివరాలను వెల్లడించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సు మారు 25వేల మంది సందర్శకులు హాజరు అవుతారని అంచానా వేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఈఈపీసీ రీజినల్ చైర్మన్ రామన్ రఘు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈడి దిలిప్ నాగేష్ రోజేకర్, ఎన్టీపీసీ డిజీఎం ఇబ్రహిమ్ రాజీ పాల్గొన్నారు.