28-01-2026 12:15:31 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, జనవరి 27: మహిళలు స్వశక్తితో ఎదిగి, కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని సౌభాగ్య నగర్ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం కుట్టుశిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచితంగా కుట్టుశిక్షణ ఇచ్చిన లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ సీఈవో నాగరాజు, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, ఎల్బీనగర్ ఇన్‌చార్జి బండి ప్రభా వతిని అభినందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, నాయకులు తిలక్ రావు, రాకేశ్ ఠాగూర్, నర్సింహాగుప్తా, చంద్రశేఖర్ రెడ్డి, కళావతి, షబానా, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.