calender_icon.png 28 January, 2026 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

28-01-2026 12:17:26 AM

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

వేములవాడ,జనవరి 27,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీలకు మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలులో ఉన్నాయన్నారు.వేములవాడ ఆలయ అభివృద్ధి తమ బాధ్యత అని, బస్ స్టేషన్, చందుర్తి బస్ స్టాండ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లాల తొలగింపు ఉండదని, హద్దుల సమస్యలపై కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.