calender_icon.png 17 July, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ ఓటమి..

14-07-2025 10:06:24 PM

భారత్ vs ఇంగ్లాండ్: భారత్ vs ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌(Lords)లో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా జరిగిన 5వ రోజు ఆటలో భారత్ తృటిలో ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అర్ధ సెంచరీతో రాణించగా, 11వ నంబర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రతిఘటనతో భారత్ వీరోచిత ప్రతిఘటనను ప్రదర్శించింది. అయితే, దురదృష్టవశాత్తు సిరాజ్ 75వ ఓవర్‌లో భారత్ 170 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది.