calender_icon.png 15 July, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్యప్‌తో విడిపోతున్నా..

15-07-2025 12:00:00 AM

స్వయంగా ప్రకటించిన సైనా నెహ్వాల్

హైదరాబాద్, జూలై 14: తెలుగు బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌తో బ్యాడ్మింటన్ మహిళా స్టార్ సైనా నెహ్వాల్ విడిపోనున్నారు. ఏడేండ్ల వీరి వివాహ బంధానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఇద్దరూ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని సైనా నెహ్వా ల్ స్వయంగా వెల్లడించింది. ఎంతో ఆలోచించి, చర్చించిన అనంతరం తాను, కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సైనా పేర్కొంది.

‘జీవితం కొన్ని సార్లు మనల్ని విభిన్న మా ర్గంలో తీసుకెళ్తుంది. సుదీర్ఘ చర్చలు ఎన్నో ఆలోచనల తర్వాత నేను, కశ్య ప్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం.’ అంటూ సైనా నెహ్వాల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే దీనిపై కశ్యప్ ఇంకా స్పందించలేదు. బ్యాడ్మింటన్ కోచింగ్ అకాడమీలో మొ దలైన వీరి స్నేహం ప్రేమగా మారడంతో ఇద్దరూ 2018లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

ఇటీవలే కశ్యప్ కాంపిటీటివ్ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కోచింగ్‌పై దృష్టిపెట్టాడు. సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. సైనా నెహ్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్, అర్జున అవార్డ్, ఖేల్ రత్న అవార్డులతో సత్కరించింది.