15-12-2024 12:36:01 AM
బెంగళూరు: దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. నేడు జరగనున్న ఫైనల్లో ముంబై, మధ్యప్రదేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ సాయంత్రం 4.30 నుంచి మొదలుకానుంది. 2023లో చాంపియన్‌గా నిలిచిన ముంబై రెండోసారి ట్రోఫీ అందుకునేందుకు ఉవ్విళ్లూ రుతుండగా.. తొలిసారి టైటిల్‌ను ఒడిసిపట్టాలని మధ్యప్రదేశ్ భావిస్తోంది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, శివమ్ దూబే, పృథ్వీ షా, రహానేలతో ముంబై బ్యాటింగ్ అత్యంత బలంగా ఉంది. ఈసారి భారీ స్కోర్లను అవలీలగా చేజ్ చేస్తున్న ముంబై ఫైనల్లోనూ అదే మంత్రం జపించే అవకాశముంది. టోర్నీలో రహానే 432 పరుగులతో (8 మ్యాచ్‌ల్లో) టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో ఐదు అర్థసెంచరీ లున్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 329 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరితో పాటు పృథ్వీ, సూర్యకుమార్, శివమ్ దూబే హిట్టింగ్ చేస్తుండడం సానుకూలాంశం.
బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, సయాన్ ఘోష్ చెరో 13 వికెట్లతో ముంబైకి కీలకంగా మారారు. మరోవైపు మధ్యప్రదేశ్‌కు కెప్టెన్ రజత్ పటిదార్ పెద్ద బలం. 9 మ్యాచ్‌ల్లో 347 పరుగులు సా ధించిన పటిదార్ టాప్ కొ నసాగుతున్నాడు. పటిదార్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో వెంకటేశ్ అయ్యర్ (210 పరుగు లు).. బౌలింగ్‌లో ఆరు వికె ట్లు పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక మధ్య ప్రదేశ్‌కు బౌలింగ్ బలం బాగుంది. స్పిన్నర్ కు మార్ కార్తికేయ (16 వికెట్లు), అవేశ్ ఖాన్ (10 వికెట్లు), త్రిపురేశ్ సింగ్ (7 వికెట్లు) ఫైనల్లో కీలకం కానున్నారు. ఇక ఇప్పటివరకు ఒక్కసారి టైటిల్ గెలవని మధ్యప్రదేశ్ 2010 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది.