30-04-2025 06:01:29 PM
న్యూఢిల్లీ: ప్రతీకార చర్యలు తప్పవన్న భారత్ హెచ్చరికతో పాకిస్థాన్ వణుకుతోంది. పాకిస్థాన్ సైన్యం(Pakistan Army) సరిహద్దుల్లో భారీగా బలగాలు బలగాలను మోహరిస్తుంది. ఇప్పటికే యుద్ధనౌకలు, జలాంతర్గాములను మోహరించింది. మెరుపు దాడుల భయంతో రాడార్ వ్యవస్థను పాక్ సరిహద్దులకు చేర్చింది. 36 గంటల్లోనే సైనిక చర్యకు భారత్ ప్రణాళికలు రచిస్తోందని పాకిస్థాన్ మంత్రి అతవుల్లా స్పష్టం చేశారు. తాము ఉగ్రవాద బాధితులమేనని పాక్ మంత్రి అతవుల్లా తరార్(Pakistani Minister Attaullah Tarar) సూచించారు. కాశ్మీర్‌లో పహల్గామ్ సమీపంలోని బైసారన్‌లో ఎక్కువగా దేశీయ పర్యాటకులతో కూడిన బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కనీసం 28 మంది మరణించారు.