calender_icon.png 23 November, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌పై జీవో

23-11-2025 12:34:54 AM

  1. అధికారిక ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
  2. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు
  3. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు

హైదరాబాద్, నవంబర్ 22(విజయక్రాంతి) : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్ని కల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అయితే పంచాయతీ ఎన్నిక లకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవోను జారీచేసింది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలుపడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లకు విధివిధానాలను ఖరారు చేసింది.

ఈ మేరకు శనివా రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు జీవో నెం.46ను విడుదల చేశారు. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ఇందులో భాగంగా వార్డు మెంబర్ స్థానాలకు కులగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పిస్తు న్నది. సర్పంచ్ పదవుల్లో మాత్రం బీసీలకు కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తుండగా, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం ఇచ్చిన జీవోకు అనుగుణంగా వార్డు మెంబర్ పదవులకు ఎంపీడీవోలు రిజర్వేషన్లు ఖరారుచేయ నుండగా, సర్పంచ్ పదవులకు ఆర్టీవోలు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో రొటేషన్ పద్ధతిలో సీట్లును కేటాయిస్తారు. నేడు, రేపు జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత ఎన్నికలకు సంసిద్ధ త వ్యక్తంచేస్తూ రాష్ర్ట ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది.

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఈనెల 24న రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసి, విచారణ ముగించాలని కోరనుంది. హైకో ర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం అదేరోజు లేక మరుసటి రోజు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ర్ట ఎన్నికల సంఘం సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై జరుగుతున్న చర్చకు తాజాగా జారీచేసిన ఉత్తర్వులు తెర దించాయి. అయితే 50 శాతం రిజర్వేష న్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారుచేస్తూ ప్రభుత్వం విడుదలచేసిన ఈ జీవో ప్రకారం బీసీలకు సర్పంచ్, వార్డు స్థా నాల్లో 23 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి.