07-09-2025 03:04:17 PM
వరద నీటిలో నిలిచిపోయిన బస్సు ప్రయాణికులను సురక్షితంగా చేర్చిన ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్
వరంగల్, (విజయక్రాంతి):వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షం(Heavy rain) కారణంగా వరంగల్ ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరుకోవడంతో ఒక్కసారిగా ఈ నీటిలో బస్సు వరద నీటిలో చిక్కి నిలిచి పోయింది. సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్ షుకూర్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని చేరుకొని తాళ్ల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు రప్పించారు. అదేవిధంగా ముప్పు ప్రాంతాలు చాలా వరకు మునిగిపోయాయి. నాళాలు సరిగా లేక వర్షపు నీరు రోడ్లపై నిలిచి బాటసారులు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.