calender_icon.png 7 September, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత సమాజానికి సేవ చేయాలి

07-09-2025 02:50:54 PM

నల్గొండ డిఎస్పీ కే. శివరామిరెడ్డి  

నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): యువత ప్రవక్త అడుగుజాడల్లో నడిచి సమాజానికి సేవ చేయాలని నల్లగొండ డిఎస్పి  కే శివరాం రెడ్డి (Nalgonda DSP K Sivaram Reddy) సూచించారు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం సందర్భంగా మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని  గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన మెగా  రక్తదాన శిబిరాన్ని నల్లగొండ వన్ టౌన్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డితో   ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మిలాద్ కమిటీ ప్రతి ఏడాది దాదాపు 15 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎన్నో ప్రమాదాల బారిన పడ్డ రోగులకు రక్తాన్ని అందించి రక్తదాతలుగా నిలుస్తున్నారని డి.ఎస్.పి  కమిటీ పై ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.