07-09-2025 03:01:44 PM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ పట్టణ పరిధిలో 43 కుల సంఘాలకు 2 కోట్ల 58 నిధులు మంజూరు కుల సంఘ భవనాలు(Caste community buildings ) ఆత్మగౌరవ ప్రతీకలు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) అన్నారు.ఆదివారం ప్రభుత్వ విప్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.. కుల సంఘ భవనలు పలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. ఆరు మాసాల క్రితం వేములవాడ పట్టణ పరిధిలో 43 కుల సంఘాలకు 1 కోటి 26 లక్షలు ఇచ్చామని మళ్ళీ ఇప్పుడు 1 కోటి 32 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని రెండు విడుతులగా 2 కోట్ల 58 నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. కులసంఘ భవనాలు నిర్మించుకోవడం వలన ఫంక్షన్లు, కమ్యూనిటి సమావేశలకు ఉపయోగ పడుతుందన్నారు..రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అన్నారు..