07-09-2025 03:07:42 PM
బీఆర్ఎస్ యువ నాయకులు మాణిక్ యాదవ్
అమీన్ పూర్, (విజయ క్రాంతి): అమీన్ పూర్ మున్సిపాలిటీ(Aminpur Municipality) పరిధిలోని పటేల్ గూడా బీహెచ్ఎల్ కాలనీ, హరివిల్లు కాలనీ, బీఎంఎన్ బ్రహ్మరాంబ మల్లికార్జున కాలనీ, రాఘవేంద్ర కాలనీ, మారుతి కాలనీ, కిష్టారెడ్డిపేట్ దుర్గా నగర్ కాలనీకి, హరివిల్లు కాలనీ, చెందిన సన్ లైట్ అపార్ట్మెంట్, ఇగ్రిసెట్, వివిధ కాలనీల్లలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గణనాధుని అన్నదాన కార్యక్రమాల్లో బిఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాణిక్ యాదవ్ మాట్లాడుతూ... అమీన్ పూర్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ గణనాధుని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.