07-09-2025 02:53:23 PM
కస్తూరిబా విద్యార్థినులకు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి భరోసా
62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) స్పష్టం చేశారు.ఆదివారం నారాయణపురం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో 62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం పాఠశాల మొత్తం పరిశీలించారు. విద్యార్థినుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు, డార్మెటరీ హాల్స్, బాత్రూంలు, టాయిలెట్లు, ప్లే గ్రౌండ్ లాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని ఆరా తీశారు.
పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి తరగతి గది, డార్మెటరీ హాల్ లను పరిశీలించి విద్యార్థినుల సంఖ్యకు సరిపడా అదనపు తరగతి గదుల నిర్మాణం, నూతన డార్మెటరీ హాల్స్ తో పాటు 12 మంది విద్యార్థినులకు ఒక్కో టాయిలెట్, బాత్రూమ్స్ చొప్పున ఉండేలా సరిపడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విభాగానికి చెందిన ఇంజనీర్లు వేసిన ఇంజనీర్ ప్లాన్ ను పరిశీలించి విద్యార్థునుల భవిష్యత్తు కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయించి పనులు మొదలు పెడతామన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి సాయ శక్తుల కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులతోపాటు కస్తూర్బా సిబ్బంది, సంబంధిత శాఖ ఇంజనీర్ లు పాల్గొన్నారు.
సిపిఐ నాయకుల నిరసన:
కస్తూర్బా పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపనలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను ఆహ్వానించకుండా అవమానించిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. డి. ఇ ,కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు.