calender_icon.png 5 November, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

05-11-2025 02:11:47 PM

హైదరాబాద్: పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఎంపీ గోడం నగేష్ ఇంటిని బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్  బీఆర్ఎస్ శ్రేణులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. జిల్లాలో పత్తి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, పత్తి కొనుగోళ్లు జరగడం లేదంటూ స్థానిక ఎంపీ నగేష్ ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఎంపీ నగేష్ ఇల్లు ముందు బైఠాయించారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పలువురు కార్యకర్తలకు గాయలయ్యాయి. అనంతరం పోలీసులు జోగు రామన్నను అదుపులోకి తీసుకొని ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.