calender_icon.png 5 November, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తృటిలో తప్పిన పెను ప్రమాదం.!

05-11-2025 03:07:55 PM

నల్లమల ఘాట్ రోడ్డులో రోడ్డు కిందికి ఒరిగిన ఆర్టీసీ బస్సు

అచ్చంపేట: అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి సమీపంలో మంగళవారం ఘాట్ రోడ్డుపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అక్కమహాదేవి మలుపు వద్ద అతివేగంతో అదుపు తప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు రోడ్డుపై అడ్డుగా నిల్వ ఉండటంతో కొంతసేపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.