calender_icon.png 5 November, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంద్ తప్పా.. వేరే మార్గం లేదు

05-11-2025 02:40:39 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించిన నిధల సమీకరణపై ప్రైవేట్ ఉన్నత విద్య సంస్థల సమాఖ్య అధ్యక్షుడు రమేశ్ మీడియా సమాచారం నిర్వహించారు. ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదని, బంద్ తప్పా వేరే మార్గం లేదని పేర్కొన్నారు. గత నాలుగు రోజుల నుంచి కళాశాలలు బంద్ పాటిస్తున్నాయని, 10 వేల బకాయిలలో 50 శాతం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన వివరించారు. పరీక్ష జరపడానికి అన్ని కళాశాలలో అధ్యాపకులు లేరని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడతల వారీగా10 నెలల్లో ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

మా బంద్ పై తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు స్పందించలేదని, ప్రభుత్వం పాటించే నిశబ్ధం తమకు బాధగా ఉందన్నారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి ఏ విషయమైన చెబుతే బాగుంటుందని, లేకపోతే అన్ని కళాశాలల అధ్యాపకులను హైదరాబాద్ తీసుకొస్తామని రమేశ్ హెచ్చరించారు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 8వ తేదీన ఈ అంశంపై సభ నిర్వహిస్తామని, ఈ సభకు లక్ష మంది అధ్యాపకులు వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు సంవత్సరాల నుంచి ఉన్న బకాయిలను తీర్చాలని, ఈ నెల 11,12న 10 లక్షల మంది విద్యార్థులతో కూడా సభ నిర్వహిస్తామని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే బంద్ ఇలానే కొనసాగుతుందని రమేశ్ తెలిపారు.