8 August, 2026 | 2:44 AM

పేరుకే క్రీడలు.. పైసలకే ప్రాంగణాలు..!

08-08-2026 01:37 AM
  1. ఎక్కడపడితే అక్కడ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు
  2. బోర్డులు ఏర్పాటు చేసి
  3. బిల్లులు కాజేశారు!
  4. ఒక్కో క్రీడాప్రాంగణానికి రూ.లక్షలలో ఖర్చు, క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తేవాలని గ్రామస్తుల వేడుకోలు

మోతె, ఆగస్టు 7:గ్రామాల్లోని క్రీడాకారులను వెలికి తీయాలనే సంకల్పంతో గ్రామాల్లో క్రీడ ప్రాంగణాల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. గ్రామీణ క్రీడాకారులను సైతం రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో రాణించేటట్లు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా క్రీడా ప్రాంగణాలు అనువైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయ కుండానే బోర్డులు పెట్టేశారు.

బోర్డులు పెట్టి న ప్రాంతంలో క్రీడలకు ఉపయోగపడేలా భూమిని చదును చేయలేదు. అలాగే వదిలేసి బోర్డులు పెట్టేశారు. ప్రస్తుతం చాలా గ్రా మాల్లో క్రీడా ప్రాంగణాలు లేవు క్రీడా ప్రాంగణాలు అన్న రీతిగా వ్యవహారం ఉంది. మోతె మండలంలో ఏర్పాటు చేసిన క్రీడ ప్రాంగణాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి.

క్రీడలకు అనువైన మైదానాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తే అక్కడ క్రీడలకు అణువుగా ఉండేది కానీ ఎక్కడపడితే అక్కడ క్రీడా ప్రాంగణాలకు బోర్డులు పెట్టడంతో ఆ ప్రాంగణాలు ఉపయోగకరం గా లేకుండా పోయాయి. మోతె మండలంలో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు ఉపయోగకరం గా లేకుండా పోయాయి. చాలా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నామ్ కె వాస్తుగా ఉన్నాయి. కొన్నిచోట్ల గతంలో ఉన్న క్రీడ మైదానాల్లోనే క్రీడా, క్రీడా ప్రాంగణం బోర్డులు ఏర్పాటు చేయగా మరికొన్ని చోట్ల అణువు గాని చోట్ల బోర్డులు పెట్టేసి క్రీడా మైదానాలుగా చిత్రీకరించారు.

నామ్ కే వాస్తు క్రీడా ప్రాంగణం బోర్డులు ఏర్పాటు

మండల పరిధిలోని కొత్తగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదురుగా క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణం బోర్డు పెట్టారు. కానీ అక్కడ క్రీడలకు అవసరమైన మైదానమే లేదు. సదరు అధికారులు బోర్డు పాతి వెళ్ళిపోయారు. అక్కడ క్రీడలు ఆడుతున్నారా లేదా అనే విషయం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం క్రీడ ప్రాంగణం ఉన్న బోర్డు పక్కనే నివాసపు ఇండ్లు ఉన్నాయి. అక్కడ మైదానానికి అవసరమైన స్థలమే లేదు.

కానీ అక్కడ బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని గాలికి వదిలేశారు. మైదానాలు ఏర్పాటు చేసి క్రీడలను అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వానికి అధికారులకు కుచ్చుటోపి పెట్టారు. మోతె మండల కేంద్రంలో సైతం ఉన్న క్రీడ మైదానానికి క్రీడా ప్రాంగణంగా చిత్రీకరించి బోర్డు ఏర్పాటు చేశారు.

ఒక్కో క్రీడా ప్రాంగణానికి లక్షల ఖర్చు...

ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కోసం లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది ఒక్కో క్రీడా ప్రాంగణానికి రెండు లక్షల నుంచి 3 లక్షల 50 వేల వరకు ఎంబి రికార్డులు చేసుకొని బిల్లును పొందారు. కానీ ప్రస్తుతం ఆ క్రీడా ప్రాంగణాలు ఉపయోగకరంగా లేకుండా పోయా యి. యువకులు, విద్యార్థులు గతంలో ఎక్కడ మైదానాలను ఉపయోగించుకున్నారో అక్కడే ఆడుకుంటూ క్రీడల్లో తర్పిదు పొందుతున్నారు.

పర్యవేక్షణ లేకపోవడంతోనే

క్రీడ ప్రాంగణాలను ఏర్పాటు చేసే సమయంలో సరైన అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతోనే ఎక్కడపడితే అక్కడ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి డబ్బులను వృ ధా చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితం అయ్యాయని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కడెక్కడ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారో అక్కడక్కడ మైదానాలను చదును చేసి క్రీడలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవా లని యువకులు కోరుతున్నారు.   

క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తేవాలి

 గత ప్రభుత్వ హయాంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. అయితే అవి ఏర్పాటు చేసిన చోట కేవలం బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఆ ప్రాంగణమంతా నిరుపయోగ మొక్కల నిండిపోయింది. ఓ గ్రామాలలో క్రీడలు నిర్వహించేందుకు అవకాశాలు లేకుండా పోయాయి. శారీరక దారుఢ్యం కోసం యువకులు క్రీడా ప్రాంగణాలు లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలి.

మట్టిపల్లి సైదులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, సూర్యాపేట