పెరిగిన విదేశీ మారక నిల్వలు
ముంబై, ఏప్రిల్ మే 10: వరుసగా మూడు వారాలపాటు క్షీణించిన విదేశీ మారక నిల్వలు హఠాత్తుగా పెరిగాయి. మే 3తో ముగిసిన వారంలో భారత్ వద్దనున్న ఫారిన్ ఎక్సేంజ్ రిజర్వులు 3.66 బిలియన్ డాలర్ల మేర పెరిగి 641.59 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి. అంతక్రితం ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో 2.42 బిలియన్ డాలర్లు తగ్గి 637.922 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఏప్రిల్ తొలివారంలో రికార్డు గరిష్ఠస్థాయికి చేరిన తర్వాత వరుస మూడు వారాల్లో విదేశీ మారక నిల్వలు 10.5 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 4,459 బిలియన్ డాలర్ల వరకూ పెరిగి 564.161 బిలియన్ డాలర్లకు చేరాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
తగ్గిన బంగారం నిల్వలు
దేశం వద్దనున్న బంగారం నిల్వలు సైతం సమీక్షావారంలో 653 మిలియన్ డాలర్ల మేర తగ్గి 54.88 బిలియన్ డాలర్లకు చేరా యి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 2 మిలియన్ డాలర్లు పెరిగి 18.051 బిలియ న్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దను న్న రిజర్వులు 140 మిలియన్ డాలర్లు క్షీణించి 4.499 బిలియన్ డాలర్లకు చేరాయి.






