calender_icon.png 11 July, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఇందిరా మహిళాశక్తి సంబురాలు

09-07-2025 12:00:00 AM

కామారెడ్డి, జూలై 8 (విజయక్రాంతి) ః కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్యలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు మంగళవారం ఘనంగా  దోమకొండ మండల సమాఖ్య నందు నిర్వహించారు.

ఈ సమావేశము నందు గత సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల నివేదిక గురించి మాట్లాడడం 363 మంది మహిళలు సంఘాలలో చేర్పించడం, అమ్మ ఆదర్శ పాఠశాల మౌలిక వసతుల ఏర్పాటు, 2569 మంది స్కూల్ యూనిఫాంల స్టిచ్చింగ్, మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు, 431 మైక్రో ఎంటర్ప్రుజైస్ ల ఏర్పాటు, 30 పాడి గేదెల కొనుగోలు, పెరటి కోళ్ల పెంపకం.

బ్యాంకు ద్వారా 37 కోట్ల రుణాలను పంపిణీ వంటి ప్రగతి గురించి మాట్లాడడం జరిగినది. సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల ప్రత్యేక అధికారి జ్యోతి , అదనపు విజయలక్ష్మి  హాజరై 2025 - 26 సంవత్సరానికి మిగిలిపోయిన మహిళలను సంఘంలో చేర్పించడం, గ్రామ సంఘానికి ఒక వృద్ధుల సంఘం, ఒక వికలాంగుల సంఘం, కిషోర్ కిషోర్ బాలికల సంఘం ఏర్పాటు చేయాలని ,

మండల సమాఖ్య ద్వారా బస్సును కొనుగోలు చేయాలని గోడౌన్ నిర్మాణం చేయాలని ప్రణాళిక చేశారు. గత సంవత్సరంలో వివిధ కార్యక్రమాలలో మంచిగా పని చేసిన అంబర్పేట్ మంజుల, సంగమేశ్వర్ మమత, దోమకొండ నవత, మమతలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, రాజు, సీసీలు, గ్రామ సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు.