calender_icon.png 11 July, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

09-07-2025 12:00:00 AM

జుక్కల్, జులై 8 ః కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం జరిగే సార్వత్రిక సమ్మె లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా మం గళవారం ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు జుక్కల్ మండల కేంద్రంలోని మాత్మ బసవేశ్వర చౌక్ నుంచి ఎమ్మార్వో కార్యా లయం వరకు ఈ ర్యాలీ జరుగుతుందని తెలిపారు.

నియోజకవర్గ మం డలాల, గ్రామపంచాయతీ కార్మికు లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్, అసైన్డ్ పోడు రైతు లు, ప్రతి ఒక్కరూ తమ హక్కుల సాధనకోసం ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు.