09-07-2025 12:00:00 AM
గడచిన నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 60వేల ఉద్యోగాలిచ్చాం
అభివృద్దిపై చర్చకు రా అంటూ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సవాల్
వనపర్తి, జూలై ౮ ( విజయక్రాంతి ) : లక్ష ప్రైవేటు ఉద్యోగాలిచ్చామని మీడియా సమావేశం లో మాట్లాడే కేటీఆర్ ఎల్బీ స్టేడియానికి వస్తే 60వేల ఉద్యోగులను లెక్కపెట్టి చూపిస్తామంటే అ క్కడకు రాడని అసెంబ్లీకి రమ్మంటే అక్కడకూ రాడని . కొడంగల్ వస్త, గజ్వేల్ కు , సిరిసిల్లకొస్త అంటూ బీరాలు పోతున్నారంటూ వనపర్తి శాసనసభ్యులు గౌరవ తూడిమేఘా రెడ్డి విమర్శించారు.
మంగళవారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సి ఎం సహాయ నిధి లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ఏమి పుడంగి కాదని ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే, నేను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని. వనపర్తి నుంచి సవాల్ చేస్తున్నామని మాతో చర్చకు రా. 60వేల పుస్తకాలు చదివిన మీ అబ్బను తీసుకుని అసెంబ్లీకి రా. అక్కడ చర్చిద్దామన్నారు.
మీకు సీఎం రేవంత్ రెడ్డికి పోలికా? ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే హితువు పలికారు. 18 నెలల్లో కాలంలో వనపర్తిలో రూ.10.33కోట్ల విలువ చేసే 4776 సీఎంఆర్‌ఎఫ్ , 10 విడతలుగా రూ.39కోట్ల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 3863 చెక్కులిచ్చామని, అనారోగ్యంతో బాధపడుతూ పెద్దమొత్తంలో ఖర్చు భరించలేని పేదలు 230 మందికి ని మ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందేందుకు రూ. 4కోట్ల విలువ గల ఎల్‌ఓసీలు ఇచ్చామన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వనపర్తి జిల్లాతో ఉన్న అనుబంధం కారణంగా ఇవన్నీ చేసుకుంటున్నామని ఇంకా అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఆయా మండలాల కాం గ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వనపర్తి పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.