24-11-2025 07:43:58 PM
ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం మహిళల కోసం ఇందిరా మహిళ శక్తి చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందజేసిందని ఆయన అన్నారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఉపేందర్ రెడ్డి, తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.