calender_icon.png 24 November, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాద బీమా పథకంపై ప్రజల్లో అవగాహన పెంచండి

24-11-2025 07:40:58 PM

నిర్మల్ (విజయక్రాంతి): కార్మిక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకంపై కార్మికులకు అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కార్మిక ప్రమాద బీమా పోస్టర్లను ఆవిష్కరించారు. పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ చట్టాలపై అవగాహన కల్పించాలని అనుకోని ప్రమాదాలు జరిగితే బీమా చెల్లించే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, కార్మిక శాఖ ఆదిలాబాద్ అధికారి కమిషనర్ ముత్యం రెడ్డి, ఆర్డిఓ రత్న కళ్యాణి అధికారులు పాల్గొన్నారు.