calender_icon.png 24 November, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం..

24-11-2025 07:36:08 PM

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..

మునుగోడు (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం సిపిఐ కార్యాలయంలో నారాయణపురం, మునుగోడు, చింతపల్లి, కట్టంగూర్ మండలాలకు మంజూరైన ఎనిమిది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. సీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యరంగానికి పెద్దపీట వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమూర్తి శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, బులుగూరి నరసింహ, తీర్పారి వెంకటేశ్వర్లు,  సిపిఐ జిల్లా సమితి సభ్యులు బిలాలు, సురిగి చలపతి, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మండల సహాయ కార్యదర్శి మందుల పాండు, ఈదులకంటి కైలాస్, దుబ్బ వెంకన్న, వనం వెంకన్న, చిర్రగొని శంకర్, కట్కూరి లింగస్వామి ఉన్నారు.