calender_icon.png 24 November, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివిస్ లేబరేటరీ వారిచే హెల్త్ క్యాంప్

24-11-2025 07:38:29 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నెమలికాలువ, గొల్లపల్లి గ్రామాల్లోని పాఠశాలలలో సోమవారం దివిస్ లేబరేటరీ వారిచే హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ జయంత్ కుమార్, డాక్టర్ శివ ఆధ్వర్యంలో వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జయంతి కుమార్, డాక్టర్ శివ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని శీతాకాలంలో జలుబు, జ్వరం బారిన పడకుండా, సీజనల్ వ్యాధుల బారినపడకుండా పడకుండా ఉండాలని అన్నారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తమ గ్రామాల్లో దివిస్ కంపెనీ వారు హెల్త్ క్యాంపులో నిర్వహించడం అభినందనీయమని అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దివిస్ ప్రతినిధులు సాయికృష్ణ, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు నరసయ్య, పావని, జ్యోతి, సుజాత  పాల్గొన్నారు.