calender_icon.png 24 November, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జీల పరిష్కారంలో జాప్యం చేయవద్దు

24-11-2025 07:33:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రజా అర్జీల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు చేశారు. పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని ఆమ్ ఆద్మీ జిల్లా కన్వీనర్ కు ఫిర్యాదు చేశారు. లక్ష్మణ చందా మండలంలో వైన్సులు తొలగించాలని గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డిఓ రత్న కళ్యాణి జెడ్పి సీఈవో గోవిందు అధికారులు పాల్గొన్నారు.