24-11-2025 07:34:26 PM
మహిళలకు పలు సంక్షేమ పథకాలు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు
కామారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ... మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్, ఇందిరమ్మ హౌసింగ్, మహిళా శక్తి బృందాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయ సంఘాల కోసం పెట్రోల్ బంక్ స్థాపనకు అవసరమైన భూమిని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే గుర్తించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు.కొండాపూర్ గ్రామంలో ఇందిరా క్రాంతి మహిళా సంఘాల కార్యకలాపాల కోసం ప్రత్యేక భవన నిర్మాణాన్ని త్వరలో చేపడతామని ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.