24-11-2025 07:38:46 PM
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి,(విజయక్రాంతి): మహిళల ఆర్థిక ఉన్నతితో రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మహిళల ఆర్థిక, సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు.మహిళ శక్తి తెలంగాణ శక్తి అభివృద్ధి యాత్రలో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.