calender_icon.png 4 February, 2026 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

04-02-2026 12:13:24 AM

రాష్ట్ర హౌసింగ్ సెక్రెటరీ, ఎండీ వీ.పీ.గౌతమ్

సంగారెడ్డి, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): ఇందిరమ్మ గృహ లబ్ధిదారులందరూ నిర్దేశిత గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చే సుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మ రింత పటిష్టం చేయాలని రాష్ట్ర గృహ ని ర్మాణ సంస్థ కార్యదర్శి, మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని సదాశివపేట, కో హిర్, జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లోని గ్రామాలలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులను కలిసి ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపులు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ దశలను బట్టి వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తున్నామని, ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరి తగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎం.డీ వీ.పీ. గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ కమిటీల సహకారం తీసుకుని అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం చేపట్టేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరగాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల క్షేత్రస్థా యి పరిస్థితిని మండలాల వారీగా హౌసింగ్ ఎం.డీకి వివరించారు. జిల్లాకు 12,479 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 8081 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, అందులో 6549 ఇండ్లు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 1930 మంది లబ్ధిదారులకు రూ.21 కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ జిల్లా పీడీ చలపతిరావు, ఆర్‌అండ్ బీ, పం చాయతీరాజ్ శాఖ డీఈలు, ఈఈలు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.