ఇందిరమ్మ ఇల్లు పేదలకు వరం
* ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
భూత్పూర్, ఆగస్టు 14 : ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజలకు వరమని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూత్పూర్ మండల పరిధిలోని చౌల తండా గ్రామపంచాయతీలో కొర్ర లక్ష్మి రవి నాయక్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తో పాటు ఆయన సతీమణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. గత టిఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు నూతన వస్త్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






