15 August, 2026 | 1:51 AM

ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి

15-08-2026 12:00 AM

ముషీరాబాద్, ఆగస్టు14 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశ ఐక్యతను చాటేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ముషీరాబాద్ మాజీ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్, బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ పేర్కొన్నారు.

శుక్రవారం ముషీరాబాద్ డివిజన్ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గంగపుత్ర కాలనీలోని బ్లూబడ్స్ హైస్కూల్ నుంచి విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పార్శిగుట్ట బాపూజీనగర్ మీదుగా డివిజన్ బీజేపీ పార్టీ కార్యాలయం వరకు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా సుప్రియా నవీన్ గౌడ్ భరత్ గౌడ్ లు మాట్లాడుతూ జాతీయ సమైఖ్యతను చాటుతూ ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు హర్ ఘర్ తిరంగాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జమాల్ పూరి నందు, పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్, రాజు, వసంతాచారి, మెట్టు వాసు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.